: మెక్ గ్రాత్ డ్రీమ్ టీమ్ ఇదే!
ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ గ్లెన్ మెక్ గ్రాత్ తన డ్రీమ్ టీమ్ ను ప్రకటించాడు. ఈ టీమ్ కు కెప్టెన్ గా విరాట్ కోహ్లీని ఎంపిక చేశాడు. అలాగే టీమిండియా మరో ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ను కూడా జట్టులోకి ఎంపిక చేశాడు. స్వదేశానికి చెందిన్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, మిచెల్ స్టార్క్ కు స్థానం కల్పించాడు. చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్ జట్టునుంచి జో రూట్, బెన్ స్టోక్స్, స్టువర్ట్ బ్రాడ్, బెయిర్ స్టో లకు స్థానం కల్పించాడు. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, పాకిస్థాన్ స్పిన్నర్ యాసిర్ షా, సౌతాఫ్రికా యువ పేసర్ రబాడల కు గ్లెన్ మెక్ గ్రాత్ తన డ్రీమ్ టీమ్ లో చోటు కల్పించాడు.