: 31 రాత్రి డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవు: హైదరాబాద్ డీసీపీ రంగనాథ్
న్యూ ఇయర్ వేడుకలను ఉత్సాహంగా జరుపుకునేందుకు, ముఖ్యంగా యువత ఎదురుచూస్తోంది. డిసెంబర్ 31వ తేదీ రాత్రి రోడ్లపై హడావుడి చేసేందుకు యువత సిద్ధపడుతున్న తరుణంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆ రోజు రాత్రి పది గంటల నుంచి ఆదివారం ఉదయం 5 గంటల వరకు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించనున్నట్లు హైదరాబాద్ డీసీపీ రంగనాథ్ ఒక ప్రకటన చేశారు. కొత్త ఏడాది సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి హైదరాబాద్ నగరమంతా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా నిర్వహిస్తామని, వందకు పైగా టీమ్ లు ఇందులో పాల్గొంటాయని చెప్పారు. డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడితే వారిని అదుపులోకి తీసుకుని, వారి వాహనాలను సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు.