: ఓ మహిళగా నేను గర్విస్తున్నా: మంత్రి పరిటాల సునీత
పౌరసరఫరాల శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు ఓ మహిళగా తాను గర్విస్తున్నానని ఏపీ మంత్రి పరిటాల సునీత అన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా కర్నూలులోని పొదుపు మహిళల జ్యూట్ బ్యాగ్ ల కేంద్రాన్ని ఈరోజు ఆమె పరిశీలించారు. అనంతరం, పరిటాల సునీత మాట్లాడుతూ, కల్తీలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రతి వ్యక్తీ వినియోగదారుడేనని, అన్ని విషయాలపైన అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు.