: చైనాలో ట్రంప్ టాయ్ లెట్స్...ట్రంప్ కండోమ్స్... భలే గిరాకీ
అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో చైనాలో వేగంగా వ్యాపారం జరుగుతోంది. ట్రంప్ టాయిలెట్స్, ట్రంప్ కండోమ్స్ విరివిగా అమ్ముడవుతున్నాయి. ఆయన అధ్యక్షుడైన తరువాత మొదలైన వ్యాపారం కాదిది. 2000 సంవత్సరం నుంచీ ఇవి మార్కెట్ లో ఉన్నాయి. అయితే ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తరువాత వీటికి మరింత ప్రచారం పెరిగింది. పేకాటలో అదృష్టాన్ని తీసుకొచ్చే కార్డును ట్రంప్ కార్డ్ అంటార్న సంగతి తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకుని ట్రంప్ కంపెనీకి నాందిపలికారు. ఇప్పుడు ట్రంప్ చైనాకు వ్యతిరేకంగా గళం విప్పడంతో చైనీయుల్లో ట్రంప్ టాయ్ లెట్లు, టాయ్ లెట్ పేపర్లకు మంచి గిరీకీ ఉంది. దీంతో చైనాలో ట్రంప్ ట్రేడ్ మార్క్ కోసం పలువురు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.