: అంతర్జాతీయ మార్కెట్లలో పెరిగిన బంగారం ధరలు
అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ఈ రోజు మెరిసింది. రెండు వారాల వ్యవధిలో గరిష్ఠ స్థాయికి బంగారం ధరలు ఎగిశాయి. అమెరికా డాలరు బలహీన పడడమే పసిడి ధరలు పెరగడానికి కారణం. స్పాట్ బంగారం ధర ఔన్స్ (28.34 గ్రాములు) కు 1,147.56 డాలర్లకు పెరిగింది. అమెరికా బంగారం ఫ్యూచర్ కాంట్రాక్టులు సైతం 0.7 శాతం పెరిగి 1,148.50 డాలర్లకు చేరాయి. డాలర్ ఇండెక్స్ అర శాతం వరకు నష్టపోవడమే బంగారం ధరలు పెరగడానికి కారణమని విశ్లేషకులు అంటున్నారు. అయితే, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వచ్చే ఏడాదిలో మూడు సార్లు వడ్డీ రేట్లను పెంచనున్నట్టు ఇప్పటికే ప్రకటించినందున డాలర్ సమీప కాలంలో పెద్దగా బలహీన పడకపోవచ్చని, దీంతో బంగారం ధరల పెరుగుదల పరిమితంగానే ఉంటుందని అంటున్నారు.