aiadmk: శశికళతో పన్నీర్ సెల్వం భేటీ.. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టేందుకు చిన్నమ్మ అంగీకారం

ఈరోజు జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో శశికళను తమ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం పోయెస్‌ గార్డెన్‌కు చేరుకున్నారు. తాము సమావేశంలో తీసుకున్న తీర్మానాన్ని సీఎం పన్నీర్‌సెల్వంతో పాటు నలుగురు మంత్రులు శశికళకు అందించారు. దీంతో అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టేందుకు శశికళ అంగీకారం తెలిపారు. ప్రస్తుతం శశికళతో పన్నీర్ సెల్వం చర్చిస్తున్నారు. ఈ విష‌యాన్ని అన్నాడీఎంకే పార్టీ వర్గాలు తెలిపాయి. జయ‌ల‌లిత త‌రువాత ఆ బాధ్య‌త‌లు చేప‌ట్టే అర్హ‌త, స‌మ‌ర్థ‌త శ‌శిక‌ళ‌కు మాత్ర‌మే వున్నాయని ఈ సంద‌ర్భంగా ప‌లువురు అన్నాడీఎంకే నేత‌లు పేర్కొన్నారు.


aiadmk
chinnamma

More Telugu News