: వరల్డ్ మాజీ నెంబర్ వన్ ఇవనోవిక్ సంచలన ప్రకటన.. రిటైర్మెంట్ ప్రకటించిన సెర్బియా భామ
ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైర్ అవుతున్నట్టు వరల్డ్ మాజీ నంబర్ వన్ అన్నా ఇవనోవిక్ సంచలన ప్రకటన చేసింది. ఫిట్ నెస్ సమస్యలు వేధిస్తుండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు 29 ఏళ్ల ఇవనోవిక్ పేర్కొంది. 2008లో రష్యాకు చెందిన దినారా సఫీనాను ఓడించి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలుచుకున్న మొట్టమొదటి సెర్బియా క్రీడాకారిణిగా ఆమె రికార్డు సృష్టించింది. టెన్నిస్ నుంచి రిటైర్ కావడం బాధగా ఉన్నా తప్పనిసరి పరిస్థితుల్లోనే రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చిందని ఇవనోవిక్ పేర్కొంది. ఐదేళ్ల వయసు నుంచే టెన్నిస్ ఆడాలని కలలు కనేదానినని, తనకు తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సాహం అందించారని వివరించింది.