: ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జారీ చేసిన సినిమా టికెట్ ధరల జీవోను కొట్టివేసిన హైకోర్టు
సినిమా థియేటర్లలోని మొత్తం సీట్లలో 20 శాతానికి తగ్గకుండా దిగువ స్థాయి సీట్లు ఉండాలని, వాటి ధర రూ.10 ఉండాలని ఆదేశిస్తూ 2013లో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టేసింది. పట్టణాలు, నగరాల్లోని థియేటర్లను వేర్వేరు కేటగిరీలుగా గుర్తిస్తూ 2013లో ప్రభుత్వం ఈ జీవోను జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ ఉమ్మడి రాష్ట్రంలోని థియేటర్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. బుధవారం దీనిని విచారించిన కోర్టు జీవోను కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.