: నా భర్త కనిపించడం లేదు....ఆయన కోసం వెతుకుతున్నా: శశికళ పుష్ప
తన భర్త కనిపించడం లేదని ఏఐఏడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప తెలిపారు. చెన్నైలో ఆమె మాట్లాడుతూ, ఉదయం నుంచి ఆయన కోసం వెతుకుతున్నానని, ఆయనపై చాలా దారుణంగా దాడి చేశారని, ఆయన ఎక్కడ ఉన్నారో కూడా తనకు తెలియడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జయలలిత మృతి వెనుక శశికళా నటరాజన్ హస్తం ఉందని ఆమె స్పష్టం చేశారు. తానింకా అన్నాడీఎంకేలోనే ఉన్నానని ఆమె స్పష్టం చేశారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో జరగనున్న రేపటి సమావేశానికి హాజరవుతానని ఆమె తెలిపారు. మరోవైపు జయలలిత మృతిపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన ఆశా రంజన్ కు బెదిరింపులు వచ్చాయి. ఆమె పిటిషన్ వెనక్కి తీసుకోకుంటే ఆమెను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని ఆమె న్యాయవాది కిస్లే పాండే వెల్లడించారు.