najib jung: నజీబ్ జంగ్ రాజీనామాను ఆమోదించిన కేంద్ర సర్కారు.. ఢిల్లీ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ గా అనిల్ బైజల్‌?

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు నజీబ్ జంగ్ ఇటీవ‌ల ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న రాజీనామాను కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఆమోదించింది. కాగా, ఆయ‌న స్థానంలో ఆ రాష్ట్ర‌ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)గా అనిల్ బైజల్‌ను నియ‌మించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. కేంద్ర ప్ర‌భుత్వం అనిల్‌ బైజ‌ల్ ను జమ్ముకశ్మీర్ గవర్నర్ గా నియ‌మించాల‌ని కూడా కొన్ని రోజులుగా యోచించింది. మాజీ ప్ర‌ధాని వాజ్ పేయి హయాంలో ఆయ‌న‌ కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా ప‌నిచేశారు.
najib jung

More Telugu News