telangana: శాసనసభలో ‘తెలంగాణ భూసేకరణ బిల్లు’కు ఆమోదం.. శాసనమండలిలో 15 బిల్లులకు ఆమోదం

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ శాస‌న‌స‌భ రేప‌టికి వాయిదా ప‌డింది. ఈ రోజు శాస‌న‌స‌భ‌లో తెలంగాణ‌ భూసేకరణ బిల్లును ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. దానిపై చ‌ర్చ అనంత‌రం ఈ బిల్లును పాస్ అయినట్టు స్పీకర్‌ మధుసూదనాచారి ప్రకటించారు. భూసేక‌ర‌ణ బిల్లుపై చ‌ర్చ‌లో భాగంగా ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు కేసీఆర్ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. వారికి స‌మాధానం చెప్పిన కేసీఆర్‌... ఆర్టికల్‌ 254 ప్రకారం 2013 భూసేకరణ చట్టానికి సవరణలు చేసే అధికారం రాష్ట్రాలకు ఉందని చెప్పారు.  ఆ అధికారంతోనే ప‌లు రాష్ట్రాలు కూడా భూసేక‌ర‌ణ చ‌ట్టం బిల్లుల‌కి స‌వ‌ర‌ణ‌లు చేశాయ‌ని పేర్కొన్నారు. మ‌రోవైపు ఈ రోజు శాసనమండలిలో మొత్తం 15 బిల్లులు ఆమోదం పొందాయి.
Go Back to Shorts
telangana
assembly

More Telugu News