trump towers: ట్రంప్ టవర్ లో కలకలం రేపిన ‘పిల్లల ఆట బొమ్మల’ బ్యాగ్

షార్ట్స్‌లో చూడండి
అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌స్తుతం ఉంటున్న‌ ట్రంప్ టవర్‌లో నిన్న కాసేపు క‌ల‌క‌లం చెల‌రేగింద‌ని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ జే పీటర్ డొనాల్డ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలుపుతూ అందుకు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేశారు. నిన్న మధ్యాహ్నం ట్రంప్ ట‌వ‌ర్‌లో గుర్తు తెలియని బ్యాగు క‌నిపించింద‌ని, దీంతో ఆ ట‌వ‌ర్‌ను ఖాళీ చేయించామని ఆయ‌న పేర్కొన్నారు. ట్రంప్‌ టవర్ లో డొనాల్డ్ ట్రంప్ ఉంటున్న పెంట్ హౌస్‌తో పాటు షాపింగ్ మాల్స్ కూడా ఉంటాయి. దీంతో వారంద‌రినీ పోలీసులు బయటికి పంపించారు అనంత‌రం ఆ బ్యాగును పరీక్షించగా అందులో పిల్లల ఆట బొమ్మలు ఉన్నట్లు గుర్తించారు.
Go Back to Shorts
trump towers

More Telugu News