: వేరే నియోజకవర్గాల్లో తెలంగాణ ప్రజలు లేరా?: డీకే అరుణ ఫైర్

తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ నిప్పులు చెరిగారు. డబుల్ బెడ్ రూమ్ లన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల నియోజకవర్గాల్లోనే నిర్మిస్తారా? అని ఆమె ప్రశ్నించారు. మిగతా నియోజకవర్గాల్లో నిర్మించరా? అంటూ నిలదీశారు. మా నియోజకవర్గాల్లో ఉన్నది తెలంగాణ ప్రజలు కాదా? అని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్లకన్నా మంచి ఇళ్లను కట్టించి ఇస్తామని హామీ ఇవ్వడం వలనే ప్రజలు టీఆర్ఎస్ ను గెలిపించారని... ఇప్పుడు వారి ఆశలన్నీ ఆవిరయ్యాయని అన్నారు.

గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సిద్ధిపేటలో మేము అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టలేదా? అని అరుణ ప్రశ్నించారు. ఇప్పుడేమో ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రోడ్లు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, మల్లన్న సాగర్, క్యాష్ లెస్ కార్యక్రమాలన్నీ సిద్ధిపేటకే పోతున్నాయని మండిపడ్డారు. తాను సోదరిలాంటి దానినని... తన నియోజకవర్గానికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇంతవరకు ఒక్క ఇంటిని కూడా తన నియోజకవర్గంలో నిర్మించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News