: వర్మ ఛాలెంజ్ ను వంగవీటీ ఫ్యామిలీ స్వీకరించకపోయినా... జీవీ స్వీకరించాడు
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'వంగవీటి' సినిమా వివాదాలకు కేంద్రంగా మారిన సంగతి తెలిసిందే. జరిగిన విషయాలను పూర్తిగా వక్రీకరించారని... రంగాను విలన్ గా చూపించే ప్రయత్నం చేశారని... వంగవీటి ఫ్యామిలీని అవమానించడానికే ఈ సినిమా తీశారని వంగవీటి ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో, తాను తీసిన సినిమా కరెక్టేనని, తప్పని మీరు భావిస్తే నిజమైన వంగవీటి సినిమా తీసుకోవాలంటూ వర్మ సవాల్ విసిరాడు. వర్మ సవాలును వంగవీటి కుటుంబసభ్యులు ఇంతవరకు స్వీకరించలేదు. కానీ, టాలీవుడ్ నటుడు, దర్శకుడు అయిన జీవీ సుధాకర్ నాయుడు మాత్రం వర్మ సవాల్ ను స్వీకరించాడు. వాస్తవాలతో కూడిన వంగవీటి సినిమాను తాను నిర్మిస్తానని జీవీ తెలిపాడు. రంగా గొప్పదనాన్ని తెలియజేసేలా ఆ సినిమా ఉంటుందని చెప్పాడు.