: ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ ఆనాటి ఉగ్రవాదుల పనేనా!
దాదాపు మూడు సంవత్సరాల క్రితం హైదరాబాద్ లోని శివారు ప్రాంతంలోని రామచంద్రాపురం, బీరంగూడలో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ శాఖలో దోపిడీ జరిగింది గుర్తుందా? అప్పట్లో మధ్యప్రదేశ్ లోని తాండ్వా జైలు నుంచి తప్పించుకుని వచ్చిన ఉగ్రవాదులు దోపిడీకి పాల్పడ్డారు. ఇప్పుడు కూడా అదే ఉగ్రవాదులు మరోసారి అదే ముత్తూట్ శాఖను టార్గెట్ చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తుపాకులతో వచ్చి, రూ. 10 కోట్ల విలువైన బంగారం, నగదు అపహరించి, పోలీసులకు సవాల్ విసిరారు. నాడు చోరీ జరిగిన చోటే నేడూ చోరీ జరగడం కలకలం రేపుతోంది. నలుగురు వ్యక్తులు రెడ్ స్కార్పియోలో వచ్చి ఈ దోపిడీకి పాల్పడగా, యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.