: మీడియా వాళ్లను చూస్తే భయపడి తలుపులు వేసుకోవాల్సి వస్తోంది: రామ్మోహన్ రావు భార్య ఆవేదన
తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు, ఆయన కుమారుడు వివేక్ ఇంటిపై ఐటీ దాడుల అనంతరం ఆయన భార్య తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు. ఓ తెలుగు చానల్ తో మాట్లాడుతూ తమ కుటుంబానికి అన్యాయం జరిగిందని కన్నీరు మున్నీరయ్యారు. తమ స్వస్థలంలో ఎంతో పరువు, ప్రతిష్ఠలున్న కుటుంబం తమదని, మూడు దశాబ్దాల పాటు సొంత రాష్ట్రాన్ని వదిలి తమిళనాడుకు సేవ చేస్తే, తనను, తన బిడ్డలను తనిఖీల పేరు చెప్పి రోడ్డు మీద పెట్టారని ఆరోపించారు. మీడియా వాళ్లను చూస్తే భయపడి తలుపులు వేసుకోవాల్సి వస్తోందని, ఇలాంటి పరిస్థితి ఎన్నడూ రాలేదని అన్నారు. తమ కుటుంబానికి ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిదో తెలియడం లేదని తెలిపారు.