: చూడటానికి అలా కనిపిస్తోంది... ఘోర ప్రమాదం ఏమీ కాదు... రైలు ప్రమాదంలో ఎవరూ మరణించలేదు: కాన్పూర్ కలెక్టర్

ఈ ఉదయం కాన్పూర్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో ఇద్దరు మరణించినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని, గాయపడిన వారంతా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రమాదంలో 28 మందికి గాయాలు అయ్యాయని అన్నారు. కొన్ని బోగీలు కాలువలోకి ఒరిగాయని, అయినా, ఎవ్వరూ నీట మునగలేదని తెలిపారు. చూసేవారికి ఆందోళన కలిగించేలా రైలు ప్రమాద దృశ్యాలు ఉన్నాయే తప్ప, వాస్తవానికి అంత ఘోర ప్రమాదం ఏమీ కాదని వివరణ ఇచ్చారు. ఇదే విషయాన్ని అలహాబాద్ రైల్వే డివిజనల్ మేనేజర్ సైతం స్పష్టం చేశారు. ఇప్పటివరకూ ఎవరూ మరణించలేదని, కొంతమంది పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారని ఆయన పేర్కొన్నారు.

More Telugu News