: మరో దిగ్గజ కంపెనీకి బ్రాండ్ అంబాసడర్ గా అక్షయ్ కుమార్
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ మరో దిగ్గజ సంస్థకు బ్రాండ్ అంబాసడర్ గా నియమితుడయ్యాడు. ప్రఖ్యాత ఆటోమొబైల్స్ కంపెనీ టాటా మోటార్స్ కు అక్కీ బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరించనున్నాడు. జనవరి 2017 నుంచి తమ కమర్షియల్ వాహనాలకు అక్షయ్ బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తారని టాటా మోటార్స్ ఓ ప్రకటనలో తెలిపింది. "అక్షయ్ కుమార్ ఎంతో ప్రజాకర్షణ ఉన్న నటుడు. అతని పాప్యులారిటీ మా సంస్థ అభివృద్ధికి దోహదపడుతుంది" అని టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ బిజెనెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవీంద్ర తెలిపారు. ఈ ఎండార్స్ మెంట్ పై అక్షయ్ కుమార్ స్పందిస్తూ... టాటా మోటార్స్ బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరించడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడు. ఇండియన్ ట్రక్కింగ్ లో టాటా మోటార్స్ కు మించిన సంస్థ మరేదీ లేదని తెలిపాడు.