: నా చరిత్రను సినిమాగా తీస్తే... నా పాత్రకు ఆమె మాత్రమే సరిపోతుంది: సన్నిలియోన్
మాజీ పోర్న్ స్టార్ సన్నీలియోన్ బాలీవుడ్ కు వచ్చిన కొత్తలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. అయితే, వాటన్నింటినీ అధిగమించి ప్రస్తుతానికి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తాజా చిత్రం 'రాయిస్'లో ఆమె స్టెప్పులేసిన 'లైలా మే లైలా' పాట సినీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీంతో ఫుల్ ఖుష్ గా ఉంది సన్నీ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సినిమాల్లో నటించేందుకు తాను ఎలాంటి షరతులు విధించుకోలేదని స్పష్టం చేసింది. స్క్రిప్ట్ బాగుంటే.... ఎలాంటి అబ్జెక్షన్స్ లేకుండా, పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేకూరుస్తానని చెప్పింది. ప్రస్తుతం బాలీవుడ్ లో బయోపిక్ ల పర్వం కొనసాగుతోందని... ఒక వేళ తన జీవిత చరిత్రను సినిమాగా తీస్తే, అందులో తన పాత్రలో విద్యాబాలన్ నటించాలని కోరుకుంటున్నానని తెలిపింది. తన పాత్రకు విద్యాబాలన్ అయితేనే న్యాయం చేయగలదని చెప్పింది.