: తమిళనాడు మాజీ సీఎస్ తనయుడు వివేక్ ఆస్తుల్లో 500 ఫ్లాట్లు, రూ. 1,700 కోట్ల స్టార్ హోటల్!


తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమిళనాట వివేక్ వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను సంపాదించారని తమిళ మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి. రాష్ట్ర మాజీ సీఎస్ రామ్మోహనరావు ఇంటిపై సీబీఐ, ఈడీ దాడుల అనంతరం ఆయన కుమారుడు వివేక్ ఇళ్లపైనా దాడులు జరుగగా, కోట్లాది విలువైన ఆస్తులు, నగదు, బంగారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక వివేక్ ఎంతో మందికి కమిషన్లపై ప్రభుత్వ కాంట్రాక్టులు ఇప్పించారని, గుట్కా వ్యాపారులకు తనవంతు సహాయం చేశాడని తెలుస్తోంది. ఇక బెంగళూరులో 500 అపార్టుమెంట్లు ఉన్న గృహ సముదాయంతో పాటు విదేశాల్లో రూ. 1,700 కోట్లకు పైగా విలువున్న స్టార్ హోటల్ ఆయనకుందని విచారణలో వెల్లడైనట్టు సమాచారం. ఇదిలావుండగా, తన ఇంటిపై దాడుల అనంతరం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన రామ్మోహనరావును ఆసుపత్రి నుంచి గత రాత్రి డిశ్చార్జ్ చేశారు.

  • Loading...

More Telugu News