: కరణ్ జొహార్ కు షాకిచ్చిన విరాట్ ప్రియురాలు!


ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కరణ్ జొహార్ కు టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రియురాలు అనుష్క శర్మ ఝలక్కిచ్చింది. బాలీవుడ్ స్టార్స్ తో 'కాఫీ విత్ కరణ్' పేరిట ఓ టాక్ షోను కరణ్ జొహార్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సరదాగా మాట్లాడుతూ, అనుష్కతో ప్రేమలో పడిపోయానని అన్నాడు. కేవలం అనుష్క కోసమే 'యే దిల్ హై ముష్కిల్' సినిమా చేశానని అన్నాడు.

దీనికి వెంటనే రిటార్ట్ ఇచ్చిన అనుష్క... 'అవును, అందుకే షూటింగ్ సమయంలో నన్ను అసభ్యంగా తాకావు' అంటూ ఆరోపించింది. దీనికి అక్కడే ఉన్న కత్రినా స్పందిస్తూ... 'నీలో చురుకుదనం తెచ్చేందుకు కరణ్ అలా తాకి ఉంటాడ'ని సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. దీంతో గతంలో జాక్వెలిన్ ఫెర్నాండెస్ కూడా అతనిపై ఫిర్యాదు చేసిందని చెప్పింది. డిజైనర్ మనీష్ మల్హోత్రా పార్టీలో ఆమెను అసభ్యంగా తాకాడని ఆరోపించింది. దీంతో కత్రినా కల్పించుకుని 'ఈ లీగల్ తగాదా ఇక్కడితో ఆపేయండి' అనడంతో ఇద్దరూ దానిపై చర్చ నిలిపేశారు. 

  • Loading...

More Telugu News