: ఎక్కడికెళ్లినా ఒకటే మాట...ముఖస్తుతి కాదు: కోదండరామిరెడ్డి


ఈ మధ్య కాలంలో ఎక్కడికెళ్లినా ఒకటే మాట వినిపిస్తోందని దర్శకుడు కోదండరామిరెడ్డి అన్నారు. బంధుమిత్రుల ఇళ్లలో తాను విన్న ఆ మాట ఏంటంటే... 'గౌతమీపుత్ర శాతకర్ణి' టీజర్ బాగుందని అన్నారు. ఈ మాట ముఖస్తుతి కోసం చెప్పడం లేదని ఆయన తెలిపారు. 'తిరుపతిలో వేడుక, రావాలి' అంటూ బాలయ్య ఆప్యాయంగా ఆహ్వానించాడని అన్నారు. బాలయ్య ఏం చేసినా మనస్పూర్తిగా చేస్తాడని ఆయన చెప్పారు. ఈ సినిమా వందేళ్లు గుర్తుంటుందని, ఈ సినిమా వంద రోజులు ఆడాలని ఆయన ఆకాంక్షించారు. 

  • Loading...

More Telugu News