goutami putra satha karni: గర్జించే సింహానికి మాటలు రాయడమంటే మాటలా!: 'శాతకర్ణి' మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా
గర్జించే సింహానికి మాటలు రాయడమంటే మాటలా? అని గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా అన్నారు. నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న 100 వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో విడుదల వేడుక తిరుపతిలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా రచయిత సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ... బాలకృష్ణ సినిమాకి మాటలు రాయడం పట్ల ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. రగులుతున్న కాగడాకి మాటలు రాయడమంటే మాటలా? అని ప్రశ్నించారు. ఆ అవకాశం తనకే దక్కిందని చెప్పారు. 43 ఏళ్లుగా ప్రేక్షకులని అలరిస్తోన్న బాలకృష్ణ ఇప్పటికీ కొత్త 2000 రూపాయల నోటులా తళతళలాడుతూ అభిమానులని అలరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
బాలయ్యకి మాటలు రాయడం తన కల అని సాయి మాధవ్ పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా బాలకృష్ణ సినిమాలు చూస్తూ ఆనందిస్తూ వస్తున్నానని అన్నారు. ఈ సినిమాకి తాను రాస్తున్న మాటలు బాలయ్యకి నచ్చుతాయా? లేవా? అనుకున్నానని చెప్పారు. తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేశానని చెప్పారు. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ కలిస్తే ఆ సినిమా అద్భుతంగా ఉంటుందని చెప్పారు. ఈ సినిమాకి మాటలు రాసే ఓ అద్భుతమైన అవకాశం తనకు ఇచ్చారని ఆయన అన్నారు. క్రిష్ తనకు రచయితగా మంచి పేరు తెచ్చుకోవడానికి అవకాశం ఇస్తున్నారని చెప్పారు.