: పవన్ పై అనుచిత వ్యాఖ్యలు తగదంటూ ఏలూరులో ‘జనసేన’ ధర్నా
జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చౌదరి తక్షణం క్షమాపణలు చెప్పాలని ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద ఈరోజు మధ్యాహ్నం జనసేన పార్టీ కార్యకర్తలు ప్లకార్డులతో ధర్నాకు దిగారు. పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతమనేని క్షమాపణలు చెప్పకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని ఆ పార్టీ కార్యకర్తలు హెచ్చరించారు.