: తదుపరి ఎలా?... ఆర్థికవేత్తలను పిలిపించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

నోట్ల రద్దు తదనంతర పరిణామాలు, జనవరి నుంచి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించేందుకు ఆర్థికవేత్తలతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి పలువురు సీనియర్ అధికారులు కూడా హాజరు కానున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రధానితో సమావేశానికి రావాలని పలువురికి ఆదేశాలు అందాయి. నవంబర్ 8న నోట్ల రద్దును ప్రకటించిన తరువాత, ఈ తరహాలో ఆర్థికవేత్తలను, అధికారులను ప్రధాని పిలిపించడం ఇదే తొలిసారి.

ఇక 2017-18 బడ్జెట్ ప్రతిపాదనలకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చలు జరగవచ్చని తెలుస్తోంది. నీతి ఆయోగ్ సభ్యులు, వాణిజ్య, ఆర్థిక మంత్రిత్వ శాఖల కార్యదర్శలతో పాటు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (ఎన్ఐపీఎఫ్పీ) డైరెక్టర్ రతిన్ రాయ్, క్రెడిట్ సూస్ ఎండీ నీలకాంత్ మిశ్రా, ఓక్సస్ ఇన్వెస్ట్ మెంట్స్ చైర్మన్ సుర్జిత్ భల్లా తదితరులకు ఆహ్వానం వెళ్లినట్టు సమాచారం.

More Telugu News