: డబ్బే కావాలంటే మొహాన కొట్టేవాళ్లం... వర్మ మూల్యం చెల్లించక తప్పదు: వంగవీటి రాధ హెచ్చరిక
సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు డబ్బు అవసరమై తమను అడిగితే, చందాలు వసూలు చేసి మరీ మొహాన కొట్టేవాళ్లమని వంగవీటి రాధ వ్యాఖ్యానించారు. డబ్బు కోసం ఆయన తన తండ్రి జీవితాన్ని కించపరిచారని, ఇందుకు ఆయన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఆయన మీడియాతో మాట్లాడారు. తన తండ్రిని హత్య చేసిన వాళ్లు దర్జాగా బయట తిరుగుతున్నా కనిపించట్లేదా? అని వర్మను ప్రశ్నించిన ఆయన, విజయవాడ రాజకీయాల గురించి అన్నీ తెలుసునని కోతలు కోసే వర్మ, చరిత్రను వక్రీకరించారని ఆరోపించారు.