: రాంగోపాల్ వర్మకు షాక్.. వివాదాస్పద డైలాగులు తొలగించాల్సిందేనని ఏపీ డీజీపీ ఆదేశం
సంచలన డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు ఏపీ డీజీపీ సాంబశివరావు షాకిచ్చారు. తాజాగా వర్మ దర్శకత్వంలో తెరకెక్కి విడుదలై సంచలనం సృష్టిస్తున్న 'వంగవీటి' సినిమాలోని వివాదాస్పద డైలాగులను తొలగించాల్సిందేనని ఏపీ డీజీపీ సాంబశివరావు సూచించారు. డీజీపీ సూచనతో సినిమాలో వివాదాస్పదమైన 'చంపెయ్ రంగా' అనే డైలాగ్‌ను సినిమా నుంచి తీసేసేందుకు వర్మ అంగీరించినట్టు సమాచారం. సినిమాలో కొన్ని అభ్యంతరకర డైలాగ్స్ ఉన్నాయన్న వంగవీటి రాధ ఫిర్యాదుతో స్పందించిన డీజీపీ ఈమేరకు వర్మకు సూచించారు.