: హైదరాబాదులో సీఎం క్యాంపు కార్యాలయం ఎదుట ఛేజింగ్... 'పీవీఆర్ సినిమాస్' యజమాని గోపాల్ గుప్తా కుమారుడిపై కేసు
శనివారం రాత్రి 11 గంటలు... హైదరాబాదులో బిజీగా ఉండే సీఎం క్యాంపు కార్యాలయం ఎదుట ఛేజింగ్. అతి వేగంగా వెళుతున్న ఓ కారు వెంబడి సైరన్ కొడుతూ పోలీసు వాహనం. కారు ఫ్లయ్ ఓవర్ ఎక్కిన తరువాత పోలీసు వాహనం దాన్ని ఓవర్ టేక్ చేసి నిలువరించింది. అందులో ఉన్నది పీవీఆర్ సినిమాస్ యజమాని గోపాల్ గుప్తా కుమారుడు వన్ష్ గుప్తా. వారాంతాల తనిఖీల్లో భాగంగా అప్పుడే పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసుకుంటుండగా, బేగంపేట వైపు నుంచి తన కారును 100 కిలోమీటర్ల వేగంతో సీఎం క్యాంపు కార్యాలయం నుంచి దూసుకెళుతుంటే, ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ సంతోష్ కిరణ్ దాన్ని చూసి వెంబడించారు. సెక్షన్ 279 రాష్ అండ్ నెగ్లిజెన్స్ కింద చలానా రాసి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని, వన్ష్ గుప్తాను కౌన్సిలింగ్‌కు హాజరు కావాలని ఆదేశించామని పోలీసులు తెలిపారు.