: గ్యాంగ్‌స్టర్ నయీంపై 153 కేసులు.. వెల్లడించిన పోలీస్ కమిషనర్
పోలీస్ ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీం దందాలపై రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వర కు 153 కేసులు నమోదైనట్టు పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. రెండు రోజుల క్రితం కూడా మరో 19 మంది బాధితులు యాదాద్రి-భువనగిరి డీసీపీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అయితే నయీం కేసును సిట్ విచారిస్తుండడంతో ఆ కేసులను దానికి బదిలీ చేసినట్టు పేర్కొన్నారు. భువనగరి కేంద్రంగా నయీం వనస్థలిపురం, మీర్‌పేట, ఎల్బీనగర్, భువనగిరిలలో దందాలు చేసేవాడని, ఆయా ప్రాంతాల్లో బాధితులు ఎక్కువ సంఖ్యలో ఉన్నా ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన బాధితులందరికీ న్యాయం జరుగుతుందని కమిషన్ భరోసా ఇచ్చారు.