: డిజిటల్ లావాదేవీలలో తొలి డ్రా నేడే.. ఇక నుంచి రోజూ ఒక్కో నగరంలో డ్రా
నోట్ల రద్దు నిర్ణయం తర్వాత దేశ ప్రజలను డిజిటల్ లావాదేవీలవైపు ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన లక్కీ గ్రాహక్ యోజన పథకం కింద నేడు తొలి డ్రా నిర్వహించనున్నారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ నేడు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మొదటి డ్రా తీసి లబ్ధిదారుల పేర్లు ప్రకటిస్తారు. వందరోజుల పాటు రోజూ వినియోగదారులకు, ప్రతివారం వినియోగదారులు, వ్యాపారులకు డ్రా తీస్తారు.
రోజువారీ డ్రాలో 15 వేల మంది వినియోగదారులకు రూ. వెయ్యి బహుమతిగా అందజేస్తారు. ఒక్కో రోజు ఒక్కో నగరం చొప్పున మొత్తం వంద నగరాల్లో లక్కీ డ్రా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న మెగా డ్రా తీస్తారు. అయితే మొదట ప్రకటించినట్టు కాకుండా మెగా డ్రా తర్వాత కూడా ఈ పథకాన్ని కొనసాగించాలని కేంద్రం భావిస్తోంది. అయితే మెగా డ్రా తర్వాతే ఈ విషయమై నిర్ణయం తీసుకుంటామని నీతి ఆయోగ్ వర్గాలు వివరించాయి.