: ట్రంప్ అభిమానుల కోసం కాస్ట్ లీ ఫోన్ @ 1.02 కోట్లు


అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిమానుల కోసం అత్యంత ఖరీదైన ఫోన్‌ ను యూఏఈలోని షార్జాకు చెందిన గోల్డ్ జెనీ సంస్థ తయారు చేసింది. ఈ సంస్థ ప్రత్యేకత ఏమిటంటే, వినియోగదారులు కోరిన విధంగా వస్తువులకు రూపకల్పన చేయడం. అలాగే వారు కోరిన మోడిఫికేషన్స్ చేయడం ఈ సంస్థ ప్రత్యేకత. ఇకపోతే, ఈ ఫోన్ ప్రత్యేకత ఏంటంటే... సాధారణ ఐఫోన్ కు స్వచ్ఛమైన బంగారంతో చేసిన స్మార్ట్‌ కేసును తయారు చేశారు. ఈ కేస్ లో వజ్రాలు పొదిగారు. దానికి తోడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫొటో, పేరు ముద్రించారు. దీంతో ఇది ట్రంప్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

 దీని ధర లక్షా 51 వేల డాలర్లు (భారతీయ కరెన్సీలో 1.02 కోట్ల రూపాయలు) అని తయారీదారులు తెలిపారు. ఐఫోన్ ను ఈ విధమైన డిజైన్ తో చేయాలంటూ చైనాకు చెందిన ఓ మహిళ గోల్డ్‌ జెనీ సంస్థను కోరిందట. దీంతో ఈ బంగారు హంగుల ఐఫోన్ ను ఈ సంస్థ తయారు చేయడం ప్రారంభించింది. ఇప్పటి వరకు ఈ రకమైన ఫోన్లను తొమ్మిదింటిని తయారు చేసినట్టు ఈ సంస్థ చెబుతోంది. మరిన్ని ఆర్డర్లు వస్తాయని ఈ సంస్థ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. 

  • Loading...

More Telugu News