: విజయవాడను గడగడలాడించిన హత్యలు ఎందుకు జరిగాయన్నది చెప్పడమే లక్ష్యం: వర్మ


రెండు దశాబ్దాలపాటు విజయవాడను గడగడలాడించిన హత్యల వెనుక కారణాలు చూపించడమే 'వంగవీటి' సినిమా తీయడం వెనుక వున్న లక్ష్యమని ఆ సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలిపారు. తెలియని విషయాలను తాను చెప్పాలని భావించలేదని ఆయన అన్నారు. ఏదో ఒకటి చెప్పడం ద్వారా తనకు లాభం లేదని ఆయన చెప్పారు. ఈ సినిమాను కమ్మ లేదా కాపులకు అనుకూలంగా తీయడం ద్వారా తనకు ఒనగూరే ప్రయోజనం కూడా లేదని ఆయన స్పష్టం చేశారు.

తాను ఆ రెండు సామాజిక వర్గాలకు చెందినవాడిని కాకపోవడంతో తనకు ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. తన వరకు ఈ సినిమాలోని పాత్రలు వాస్తవంగా హీరోలు కారని, హింస ద్వారా మాత్రమే వారు హీరోలుగా గుర్తింపు పొందారని ఆయన గుర్తు చేశారు. అలా కాకుండా గాంధీయిజం ద్వారా వారు హీరోలన్న గుర్తింపు పొందారా? అన్నది తనకు చెప్పాలని ఆయన సూచించారు. తాను ఊహాగానాలకు అంత ప్రాధాన్యత ఇవ్వనని, వాస్తవాలపై తన ఆలోచనలకు తోచిన విధంగా సినిమా తీశానని ఆయన స్పష్టం చేశాడు. 

  • Loading...

More Telugu News