: మోదీ ఆ 40 కోట్లు తీసుకున్నారో లేదో చెప్పాలి: వీహెచ్
ప్రధాని నరేంద్ర మోదీ సహారా, బిర్లా సంస్థల నుంచి 40 కోట్ల రూపాయలు తీసుకున్నారో లేదో చెప్పాలని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని కొందరికి అనుకూలంగా తీసుకున్నారని ఆరోపించారు. నోట్లు రద్దు చేసి 40 రోజులైనా ప్రజల నోట్ల కష్టాలు తీరలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పలేదని అన్నారు. ప్రధాని మోదీకి చిత్తశుద్ధి ఉంటే తనపై వచ్చిన ఆరోపణలపై స్వతంత్ర విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. డిజిటల్ లావాదేవీలపై లాటరీ తీసి బహుమతులు ఇస్తామనడం ప్రజల దృష్టి మరల్చేందుకు చేసే ప్రయత్నమని ఆయన అన్నారు.