: లొంగిపోయిన హైజాకర్లు... కథ సుఖాంతం!
లిబియాకి చెందిన ఆఫ్రీకియా ఎయిర్ లైన్స్ కు చెందిన ఏ-320 విమానం హైజాక్ కథ సుఖాంతం అయింది. సెభా నుంచి ట్రిపోలికి 118 మందితో వెళ్తుండగా ఈ విమానాన్ని ఇద్దరు దుండగులు హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విమానాన్ని మాల్టా దీవిలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అనంతరం భద్రతా దళాలు విమానాశ్రయాన్ని చుట్టుముట్టగా, విమానాశ్రయానికి రాకపోకలు నిలిపేశారు.
వెంటనే మాల్టా ప్రధాని జోసెఫ్ మస్కట్, లిబియా ప్రధాని ఫయీజ్ అల్ సెర్రాజ్ తో మాట్లాడారు. అనంతరం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూం నుంచి వైమానిక, భద్రత ఇతర ఉన్నతాధికారులు ఫోన్ల ద్వారా హైజాకర్లతో చర్చించారు. ఈ క్రమంలో తొలుత ఒక శిశువు, 28 మంది మహిళలను వదిలిపెట్టిన హైజాకర్లు, తరువాత సిబ్బందిని మాత్రమే బందీలుగా ఉంచుకుని ప్రయాణికులందర్నీ విడిచిపెట్టారు. అనంతరం చర్చల్లో పురోగతి సాధించడంతో వారిని కూడా విడిచిపెట్టి భద్రతా దళాలకు లొంగిపోయారు. దీంతో కథ సుఖాంతమైంది.