: ఏపీ మంత్రుల కాన్వాయ్ కు ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఎస్కార్ట్ వాహనాలు!
ఏపీ మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత ప్రయాణిస్తున్న కాన్వాయ్ లో ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా కామవరపు కోట వద్ద కాన్వాయ్ వెళుతున్న సమయంలో ఒక్కసారిగా మేకలు అడ్డురావడంతో కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో ఎస్కార్ట్ వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ సంఘటనలో నలుగురికి గాయాలు కావడంతో, వారిని ఆసుపత్రికి తరలించారు.