: కారులో తనను తాను కాల్చుకున్న రాజస్థాన్ అడిషనల్ ఎస్పీ.. పక్కనే ఓ యువతి మృతదేహం!

రాజ‌స్థాన్‌ ఉగ్రవాద వ్యతిరేక దళంలో అడిషనల్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న ఆశిష్ ప్రభాకర్ (42) అనే అధికారి గత రాత్రి తన తుపాకీతోనే కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహం కారు ముందు సీట్లో ఉండగా, పక్కనే మరో యువతి మృతదేహం కూడా ఉండటం సంచలనం కలిగించింది. నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో ప్రభాకర్ ఇంటి నుంచి వెళ్లాడని, ఆపై కొన్ని గంటల తరువాత ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని రాజస్థాన్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.

పక్కనే ఉన్న యువతి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని, ఆమె ఎవరో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు వివరించారు. తనను క్షమించాలని కోరుతూ, భార్యను ఉద్దేశించి రాసిన లేఖ ప్రభాకర్ వద్ద లభించడంతో, ప్రేమ వ్యవహారం లేదా అక్రమ సంబంధం ఈ రెండు మరణాలకూ కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

More Telugu News