: నాడు రంగా అభిమానులు దహనం చేసిన అలంకార్ థియేటర్లో ... నేడు 'వంగవీటి' విడుదల


డిసెంబరు 26, 1988. నిరాహారదీక్ష చేస్తున్న వంగవీటి మోహన రంగాను అయ్యప్ప భక్తుల వేషాల్లో వచ్చిన ప్రత్యర్థులు దారుణంగా హత్య చేసిన రోజు, ఆపై వంగవీటి అనుచరులు జరిపిన దాడుల్లో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. అప్పటిలో విజయవాడ నడిబొడ్డున ఉన్న అలంకార్ థియేటర్ ను రంగా అభిమానులు దహనం చేశారు. మొండి గోడలు తప్ప ఏమీ మిగల్లేదు. చాలా కాలం తరువాత ఆ థియేటర్ తిరిగి ప్రారంభమైంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే, సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ, ‘వంగవీటి’ పేరిట రంగా జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కించగా, ఆనాడు నాశనమైన అలంకార్ థియేటర్ లో నేడు ఈ చిత్రం విడుదలైంది. సినిమా రిలీజ్‌ సందర్భంగా గొడవలు జరగకుండా పోలీసులు ఇక్కడ గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.

  • Loading...

More Telugu News