: 'వంగవీటి'లో రంగాను విలన్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు: పీఆర్పీ మాజీ నేత శోభారాణి


సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై పీఆర్పీ మాజీ నేత శోభారాణి మండిపడ్డారు. 'వంగవీటి' సినిమాలో రంగాను విలన్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వంగవీటి మోహనరంగా జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని... ఇలాంటి సినిమాలు చేయడాన్ని వర్మ మానుకోవాలని అన్నారు. ఈ సినిమా ద్వారా కాపు కులస్తుల మనోభావాలను వర్మ దెబ్బతీశారని మండిపడ్డారు. ఈ సినిమాపై ఏపీ డీజీపీని కలిసి, ఫిర్యాదు చేస్తామని చెప్పారు. 

  • Loading...

More Telugu News