: చిరంజీవితో సినిమా తీయలేను!: రాంగోపాల్ వర్మ
మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫాలోయింగ్, ఇమేజ్ కు సరిపోయే విధంగా తాను సినిమా తీయలేనని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపాడు. చిరంజీవికి తాను వీరాభిమానినని చెప్పాడు. తొమ్మిదేళ్ల తర్వత వస్తున్న చిరంజీవి 150వ చిత్రం 'బాహుబలి'ని మించి ఉంటుందని ఆశించానని... అయితే, చిరంజీవి ఓ రీమేక్ సినిమాను ఎంచుకోవడం తనకు కొంచెం నిరాశను మిగిల్చిందని చెప్పాడు. మెగాస్టార్ సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నానని తెలిపాడు.