: పన్ను కట్టని 70 లక్షల మంది అక్రమార్కులను గుర్తించిన ఐటీ శాఖ


ఇండియాలో పన్ను కట్టకుండా తప్పించుకు తిరుగుతున్న మరో 67.54 లక్షల మందిని ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది. 2014-15లో అధిక విలువగల లావాదేవీలను జరిపి, ఆపై రిటర్నులను దాఖలు చేయని వారిని సీబీడీటీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్) తయారు చేసిన ఎన్ఎంఎస్ (నాన్ ఫైలర్స్ మానిటరింగ్ సిస్టమ్) గుర్తించింది. డేటా గణాంకాలను సరిపోలుస్తున్నప్పుడు, వీరందరినీ గుర్తించామని, వాస్తవానికి 2015-16 అసెస్ మెంట్ సంవత్సరంలో రిటర్నులు దాఖలు చేయాల్సి వుందని సీబీడీటీ ఒక ప్రకటనలో పేర్కొంది. పన్ను దాఖలు చేయని వారికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు అవకాశాలను ఇచ్చిందని గుర్తు చేసిన సీబీడీటీ, విలువైన డీల్స్ చేసి, రిటర్నులు దాఖలు చేయని ప్రతి ఒక్కరినీ గుర్తించి, వారందరి నుంచి పన్నులు వసూలు చేస్తామని సీబీడీటీ అధికారి ఒకరు వెల్లడించారు. వీరందరి వివరాలనూ ఈ-ఫైలింగ్ పోర్టల్స్ లో ఉంచామని తెలిపారు.

  • Loading...

More Telugu News