: ఇదే నా ఆఖరి సినిమా అంటే... సునీల్ ‘థ్యాంక్స్’ అని మెస్సేజ్ పెట్టాడు: రాంగోపాల్ వర్మ

‘వంగవీటి’ తన ఆఖరి సినిమా అని చెబితే నటుడు సునీల్ తనకు ‘థ్యాంక్స్’ అని మెస్సేజ్ పెట్టాడని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ తో మాట్లాడుతూ, ‘‘ఇది నా ఆఖరి సినిమా’ అని సునీల్ కు చెబితే ‘థ్యాంక్స్’ అని సునీల్ మెస్సేజ్ పెట్టాడు. అయితే, నాకు ఒక డౌట్ వచ్చింది. మొత్తానికి ఇన్నాళ్లకు మన్నల్ని వదులుతున్నాడురా అనా? లేక ఫంక్షన్ కు రమ్మని సునీల్ ని  పిలిచినందుకు ఈ మెస్సేజ్ పెట్టాడా? అన్నది నాకు అర్థం కాలేదు’ ’ అని చెబుతూ వర్మ పగలబడి నవ్వాడు. కాగా, వర్మ దర్శకత్వంలో గతంలో తెరకెక్కిన ‘కథ,స్ర్కీన్ ప్లే,దర్శకత్వం అప్పలరాజు’ చిత్రంలో సునీల్ హీరోగా నటించాడు.  

More Telugu News