: ఏడో రోజూ అదే తీరు.. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

వరుసగా ఏడో  రోజూ స్టాక్ మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.ఈ రోజు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ అత్యధికంగా 262.78 పాయింట్లు నష్టపోయి 25,979.60 కు చేరగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 82.20 పాయింట్లు నష్టపోయి 7,979.10 వద్ద ముగిసింది. ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, భారతీ ఇన్ ఫ్రా టెల్, టాటా మోటార్స్, జీ ఎంటర్ టైన్ మెంట్ తదితర సంస్థల షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్, హిందాల్కో, ఓఎన్జీసీ, భారతీ ఎయిర్ టెల్, అదానీ పోర్ట్స్ తదితర సంస్థల షేర్లు నష్టపోయాయి. కాగా, ఈ ఏడాది ముగియనున్న నేపథ్యంలో విదేశీ సంస్థాగత మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీసిందని, దీంతో, ఈరోజూ స్టాక్ మార్కెట్లు కోలుకోలేకపోయాయని విశ్లేషకులు అంటున్నారు.

More Telugu News