: మహేష్ బాబును కలిసేందుకు కుటుంబంతో సహా వచ్చిన గుజరాత్ డిప్యూటీ సీఎం


టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న తాజా సినిమా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మహేష్ బాబును కలిసేందుకు ఊహించని అతిథి ఒకరు షూటింగ్ స్పాట్ కు వచ్చారు. గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ భాయ్ పటేల్ కుటుంబ సమేతంగా షూటింగ్ స్పాట్ కు వచ్చారు. మహేష్ గుజరాత్ లో షూటింగ్ నిర్వహించడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. షూటింగ్ జరుగుతున్న తీరును, వివిధ విభాగాలు సహకరిస్తున్న విధానాన్ని దర్శకుడు మురుగదాస్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నితిన్ భాయ్ పటేల్ కుటుంబ సభ్యులంతా మహేష్ బాబుతో ఫోటోలు దిగారు. దీనిపై మహేష్ బాబు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబుకు గుజరాత్ లో కూడా ఫాలోయింగ్ ఉండడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News