: బెదిరింపులతో ‘పాక్’ విడిచి వెళ్లిపోయిన గాయకుడు
కొన్ని రోజులుగా బెదిరింపులు రావడంతో పాకిస్థానీ గాయకుడు తాహిర్ షా తన దేశం విడిచి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని తాహిర్ షా అధికార ప్రతినిధి ధ్రువీకరించారు. పాకిస్థాన్ మొదటి ఆన్ లైన్ సినిమాతో చిత్రరంగంలోకి అడుగుపెట్టిన తాహిర్, క్రమంగా ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారారని, ఆయన ధోరణిని ఇష్టపడని వారు బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు. తనకు ప్రాణహాని ఉందని భావించిన ఆయనకు రక్షణ కల్పించే విషయంలో పాక్ ప్రభుత్వం ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో తాహిర్ దేశం విడవక తప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, తాహిర్ ఎక్కడికి వెళ్లారనే విషయం మాత్రం తనకు కూడా తెలియదని ఆ అధికార ప్రతినిధి చెప్పడం గమనార్హం. కాగా, తాహిర్ షా ‘ఐ టు ఐ’ వీడియో మ్యూజిక్ సాంగ్ 2013లో విడుదల అయింది. ఆ తర్వాత ‘ఏంజెల్’ సాంగ్ తో ఆయన ప్రజాదరణ పొందారు.