: ట్రంప్, కేసీఆర్ లది... ఒకే మాట, ఒకే యవ్వారం: జేసీ దివాకర్ రెడ్డి


అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లది ఒకే మాట, ఒకే యవ్వారం అని అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఆంధ్రవాళ్లను కేసీఆర్ జాగో, భాగో అన్నారని... ట్రంప్ కూడా విదేశీయులను అలాగే అన్నారని చమత్కరించారు. చంద్రబాబు నీతివంతమైన రాజకీయనాయకుడని జేసీ ప్రశంసించారు. పైసలిస్తేనే ఫైలుపై సంతకం చేసే వ్యక్తి కాదని... తాను విపక్ష నేతగా ఉన్నప్పటి నుంచి చంద్రబాబును చూస్తున్నానని చెప్పారు. చంద్రబాబు ముందుగానే బ్లాక్ మనీని వైట్ చేసుకున్నారని కొందరు ఆరోపిస్తున్నారని... ఆయన అలాంటి వాడు కాదని అన్నారు. తెలంగాణలోని రెడ్ల వద్ద డబ్బుల్లేవని... డబ్బంతా యాదవులు, గౌడ్ ల వద్ద ఉందని చెప్పారు. 

  • Loading...

More Telugu News