: ప్రజల నెత్తిన మరో పిడుగు.. ఏటీఎం నుంచి నగదు డ్రా చేశారో.. ‘చార్జ్’ పడుద్ది!


పెద్దనోట్ల రద్దుతో ప్రజలను క్రమంగా ‘క్యాష్‌లెస్’ వైపు మళ్లించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న కేంద్రం ఈ దిశగా మరో నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి బ్యాంకులు, ఏటీఎంల నుంచి నగదు డ్రా చేస్తే 0.5-2 శాతంతో సర్ చార్జి విధించాలని భావిస్తోంది. ఈ నెల 30 తర్వాత నుంచే ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని భావిస్తోంది. అయితే కనీస పరిమితికి మించి నగదు డ్రాచేసే వారికే ఈ సర్‌చార్జ్ విధించనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

అయితే ఆ పరిమితి ఎంతన్న విషయంపై ప్రస్తుతానికి  స్పష్టత లేదు. అయితే అది బ్యాంకుల నుంచి అయితే రోజుకు రూ.50 వేలు, ఏటీఎంల నుంచి అయితే రోజుకు రూ.15 వేలకు మించి డ్రా చేస్తే నిర్వహణ వ్యయం పేరుతో సర్ చార్జి విధించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన పరిశీలనలో ఉంది. సర్ చార్జి నిబంధనను 4-6 మాసాలు అమలు చేయాలని భావిస్తున్నప్పటికీ ఇది శాశ్వతంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రభుత్వ వర్గాల సమాచారం.

  • Loading...

More Telugu News