: ఈ చిత్రంలో చాలా డిఫరెంట్ గా కనపడతాను: హాస్యనటుడు సప్తగిరి


‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ చిత్రం దర్శకుడు అరుణ్ పవార్ తనకు పెద్ద ఫ్యాన్ అని ప్రముఖ కమెడియన్ సప్తగిరి అన్నాడు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ గా అరుణ్ పవార్ పనిచేసేవాడని, అప్పటి నుంచి తనకు పరిచయమని, ప్రముఖ మాటల రచయిత త్రివిక్రమ్ వద్ద అతను అసోసియేట్ రైటర్ గా పనిచేశాడని చెప్పారు. అరుణ్, తాను ఎప్పుడు కలిసినా కామెడీ సబ్జెక్టు గురించి డిస్కస్ చేస్తూ ఉండేవారమని అన్నాడు. ఈ చిత్రంలో కంప్లీట్ డిఫరెంట్ సప్తగిరి కనపడతాడని, అదంతా దర్శకుడు, నిర్మాతల కృషేనని చెప్పుకొచ్చాడు. 

  • Loading...

More Telugu News