: రాహుల్ ఆరోపణలపై మండిపడ్డ బీజేపీ నేత రవిశంకర ప్రసాద్

ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆరు నెలల్లో 9 సార్లు కోట్ల రూపాయల లంచం స్వీకరించారంటూ ఐటీ స్వాధీనం చేసుకున్న డైరీలో ఉందని, దానిపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసిన ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ మండిపడ్డారు. రాహుల్ ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. నల్లధనం వెలికి తీసేందుకు నిర్ణయం తీసుకున్న ప్రధానిపై ఇలాంటి ఆరోపణలు చేయకూడదని చెప్పారు. గత పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ అవినీతిని పెంచి పోషించిందని చెప్పారు. రాహుల్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని ప్రకటించారు. రాహుల్ గాంధీ వరుస ఓటములతో నిరాశలో ఆరోపణలు చేస్తున్నారని ఆయన తెలిపారు. 

More Telugu News