: ఏపీలో టాప్-12 నియోజకవర్గాల ఎంపిక.. మొదటి నాలుగు స్థానాలు పశ్చిమ గోదావరి జిల్లావే!


ఆంధ్రప్రదేశ్ లో టాప్-12 నియోజకవర్గాలను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మొదటి నాలుగు స్థానాలు  పశ్చిమగోదావరి జిల్లాలోని గోపాలపురం, భీమవరం, ఉంగుటూరు, ఉండి నియోజకవర్గాలకు దక్కాయి. తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట- 5వ స్థానం, కృష్ణా జిల్లాలోని గన్నవరం-6, గుంటూరు జిల్లాలోని చిలకలూరి పేట-7,  పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు, తణుకులకు వరుసగా 8,9, తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి-10, అనంతపురం జిల్లాలోని శింగనమల-11, విశాఖ వెస్ట్ నియోజకవర్గం 12వ స్థానంలో నిలిచాయి. మొత్తం పద్నాలుగు అంశాలను ఆధారంగా చేసుకుని టాప్-12 నియోజకవర్గాలను ఎంపిక చేశారు. ఈ నియోజకవర్గాల్లో తలసరి ఆదాయం, గ్రాస్ వాల్యూ ఆడిట్ (జీవీఏ), నీరు-ప్రగతి, మీకోసం ఫిర్యాదుల పరిష్కరాం, ఎన్టీఆర్ వైద్య సేవలు, ఎన్టీఆర్ భరోసా, పెన్షన్ల పంపిణీ, రహదారులపై అధ్యయనం చేసిన అనంతరం టాప్-12 నియోజకవర్గాలను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

  • Loading...

More Telugu News