: సినీ నటుడైన పాకిస్థాన్ ఛాయ్ వాలా!
ఒక్క ఫోటో ఛాయ్ వాలా జీవితాన్ని మార్చేసింది. తండ్రి చాయ్ దుకాణంలో టీ అమ్ముతూ కాలం గడిపే అర్షద్ ఖాన్ జీవితంలో ఓ టూరిస్టు తీసిన ఫోటో, సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు అతని జీవితాన్ని మార్చేసింది. రాత్రికి రాత్రే అర్షద్ ఖాన్ సోషల్ మీడియా స్టార్ అయిపోయాడు. వారం తిరిగే సరికి మోడల్ గా మారిపోయాడు. నెల తిరిగే సరికి మ్యూజిక్ ఆల్బమ్స్ లో నటించడం ప్రారంభించాడు. ఏడాది తిరగకముందే సినీ నటుడైపోయాడు. రాత్రికి రాత్రే జీవితం మారిపోవడమంటే ఇదే. కబీర్ అనే పాకిస్థానీ సినిమాలో హీరో సోదరుడి పాత్రను అర్షద్ ఖాన్ ధరించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసం ఇంగ్లండ్ కూడా వెళ్లనున్నానని అర్షద్ ఖాన్ తెలిపాడు.